![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -315 లో..రుద్ర తనకి ఆక్సిడెంట్ చేసిన అతన్ని కనుక్కొని అతని దగ్గరికి వెళ్తాడు. నీకు ఈ పని ఎవరు చెయ్యమని చెప్పారని కొడతాడు. దాంతో అతను వీరు అని చెప్తాడు. రుద్ర షాక్ అవుతాడు. మరొకవైపు రుద్ర గారికి ఆక్సిడెంట్ చేసిన డ్రైవర్ తప్పించుకున్నాడు. అతన్ని త్వరలోనే కనిపెడుతామని ఇన్‌స్పెక్టర్ ఇంటికి వచ్చి పెద్దసారు తో చెప్తాడు.
ఆ ఆక్సిడెంట్ చేయించింది ఇంటి దొంగనే అని రంగా అనగానే అందరు షాక్ అవుతారు. ఆక్సిడెంట్ చేసింది ఎవరో కాదు ఈ వీరునే అని రంగా చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావని రంగాపై శకుంతల కోప్పడుతుంది. సూర్య విషయంలో బావ తన మోసం బయటపెట్టాడని కోపంతో ఇదంతా చేసాడని రంగా చెప్తాడు. మీకు నమ్మకం లేకపోతే ఆ రౌడీ ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చెయ్యండి.. ఈ వీరునే ఉంటాడని రంగా చెప్తాడు. అప్పుడే ప్రీతీ వచ్చి.. మా అన్నయ్యని చంపాలని చూసింది మీరేనా అని వీరు కాలర్ పట్టుకొని అడుగుతుంది.
వీరు టెన్షన్ పడుతాడు. అప్పుడే రుద్ర రౌడీని తీసుకొని ఇంటికి వస్తాడు. రౌడీని చూసి వీరు ఇంకా టెన్షన్ పడతాడు. తరువాయి భాగంలో మొన్న ఫారెనర్స్ గా వచ్చింది ఎవరో కదా రంగా, గంగ.. దీన్నంతటికి సూత్రదారి రుద్ర బావ దీనికి సమాధానం చెప్పాలని వీరు అంటాడు. దానికి రంగ, గంగ గెటప్ లో వచ్చిన వీడియోని వీరు అందరికి చూపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |